పెరుగొంకాయ్ కూరోయ్ బ్లాగర్లూ! కోరి వండినానోయ్ బ్లాగర్లూ!.. ;)
"వంకాయ వంటి కూరయు" ఈ పద్యం మొత్తం కాకపోయినా ఈ లైనైనా జీవితంలో ఒకసారో,వందసార్లో వినే ఉంటారు కదా! ఎందుకూఊఊఊఊఊఊఊ అని ఎప్పుడేనా ఆలోచిస్తిరా ఎవరైనాఆఆ...ఆహాఁ! ఆలోచించారా అంట!... "ఎందుకేవిఁటి నీ మొహం! రుచిగా ఉంటుంది కాబట్టి" అని గబుక్కున అనేస్తారేమో! నాకామాత్రం తెలీకడిగానా...అయినా రుచి అనేది అన్ని కూరలకీ ఉంటుంది, దేని రుచి దానిది....కొంతమంది చేతుల్లో కొన్ని కూరలు అద్భుతంగా అలాగా కుదిరిపోతాయ్ అంతే....కొన్ని కూరలు వాటిల్లో పడాల్సిన ద్రవ్యాలు నిఖార్సుగా పడితే, వాసనకే నోట్టో నీళ్ళు రప్పించేస్తాయ్, తింటే జిహ్వకంటుకుని సంవత్సరాలపాటు వదిలిపెట్టవు.......మరి "వంకాయవంటి కూర" లేదని సదరు కవిగారు ఎందుకన్నారో!
నేను తెగ ఆలోచించేసి కనుక్కున్న కారణం చెప్తా......మిగతాపద్యం కూడా చదివితే కాస్త తెలివికొచ్చిద్ది....." పంకజముఖి సీత వంటి భార్యామణి", "శంకరుని వంటి దైవము" "లంకాపతి వైరి వంటి రాజు" వీళ్ళలాంటి వాళ్ళు లేరట! అంటే అలా, ఆయా పాత్రల్లో అనువుగా ఒదిగిపోయి, ఆ పదాలకి అర్థం అంటే వీళ్ళే,,వాళ్ళే పరమ ప్రమాణం అనిపించేవాళ్ళు కదా! కాబట్టి మనం ఇక్కడ "కూర" అనే దానికి ప్రమాణంగా తీసుకోవాలంటే ఎలా ఉండాలి అది! ఎవరు వండినా, ఎలా చేసినా "ఆహా!" అనిపించేలా ఉండాలి.....ఏ ద్రవ్యం వేసి చేసినా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా దాని అసలు లక్షణం వదిలిపెట్టకూడదన్నమాట! అలా ఎవరి చేతుల్లో ఐనా చక్కగా ఒదిగిపోయి, తిన్నవాళ్ళ నోళ్ళల్లో కరిగిపోవాలి...అద్దన్నమాట సంగతి!
ఇలాంటి లక్షణాలున్న శాకం నాకు "వంకాయ" తప్ప ఏదీ కనిపించలా....కొన్ని ఒకరకంగా చేస్తేనే బాగుంటాయ్, కొంతమందికే "వహ్వా" అనేలా కుదురుతాయి.... కాని వంకాయ మాత్రం ఎన్ని రకాలుగా వండినా, ఎవరు వండినా, ఏ ద్రవ్యం పడ్డా,పడకపోయినా...దాని రుచి దానిదే...."సాటిలేదు శాకరాజమా నీకు, అందుకో ఇవే మా ప్రణామంబులు"....ః).....
అసలు వంకాయతో ఎన్ని రకాలు వండచ్చో!!!!!.....నూనె వంకాయ, గుత్తి వంకాయ( ఇందులో మళ్ళా కారం పెట్టి,ఉల్లి ముద్ద పెట్టి, మసాలా పెట్టి,ధనియాల కారం పెట్టి,....) మెంతి వంకాయ, వంకాయ వేపుడు(పకోడీతో మళ్ళా), వంకాయ పులుసు, వంకాయ పాలేసి, పెరుగు వంకాయ,టమాటాతో,ఉర్లగడ్డతో,వంకాయ పచ్చడి, వంకాయ బజ్జిపచ్చడి, వంకాయ ఊరగాయ.......ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు ఆగదేమో...;).....
కొంతమందికి మరో డవుటు రావచ్చు....వంకాయ ఆరోగ్యానికి మంచిది కాదుగా అంటారేమో!......"వృంతాకం కోమలం పథ్యం" అండీ బాబూ...చక్కటి నాజూకు, లేలేత వంకాయలు మిగులవేపుళ్ళు కాకుండా వండుకు తింటే ఆరోగ్యానికి ఏం ఢోకా ఉండదు......ముదురు వంకాయలు మాత్రం మంచిది కాదు....కాని సంవత్సరానికొక పాలి చేసుకుతింటే బజ్జి పచ్చడీ, ఊరగాయా(ఇవి ముదిరిన వంకాయలతోనే చేస్తారు) ఆరోగ్యాన్ని చెరపవులెండి......ః).....కాబట్టి చక్కగా రకరకాలుగా వండుకు తినండి....... "వంకాయ వంటి కూరయు" అని మళ్ళా మళ్ళా పాడుకోండి..........
ఇక ఇవ్వాళ నే చెప్పబోయే వంకాయ రకం మా గుంటూరు పేటెంటన్నమాట! అదే "పెరుగు వంకాయ"......ఇహహాహ్హ! హిహిహిహి! అదో అక్కడ గోదారోళ్ళు ముఠా కట్టేస్తున్నారు....కాస్తాగండి, టపా అయ్యాక తేల్చుకుందాం మనం.....;)...... మా ఇంట్లో మా అమ్మమ్మ ఇది తప్పితే వండేదికాదు....పెరట్లో నిండా విరగ్గాసేవా...వారంలో మూడు రోజులు పెరుగొంకాయే....ఎప్పుడన్నా పులుసు, పచ్చడి...నూనొంకాయ, గుత్తొంకాయ ఎంత బతిమాలినా చేసేదికాదు, అదేమంటే "ఇట్టా చేస్తేనే వంటికి మంచిది..చలవ.." అని మా నోళ్ళు మూయించేది.....పైగా నాన్న సపోర్టు......"ఎంత రుచిగా ఉన్నా ఏం తింటామండీ బాబూ! అదే రోజూ" అనిపించేది...
మా ఊళ్ళో ఒక చిన్న "జరిగిన కథ" చెప్తుంటారు.....మా వెనకతరాలామె ఒకామె ఒక ఆదివారంనాడు వంకాయకూర,బాగా అన్ని మసాలాలూ దట్టించి వండిందంట....మొగుడు తిని "ఆహా, ఓహో, అద్భుతం, అమృతం" అన్నాట్ట....ఇంకేముంది, మా ఆయనకి ఇంత బాగా నచ్చిందిగా అని మళ్ళా మరసనాడు అదే వండిందట.....ఆ మొగుడుగారు తిని "చాలా బాగుంది ఇవ్వాళ కూర" అన్నాట్ట...మళ్ళా మరసట్రోజు కంచంలోకి అదే కూర, ఏ మార్పూలేకుండా.....తిని కూర బాగుంది అని లేచిపోయాట్ట.....ఇక అమ్మగారు శుక్రవారం వరకూ సేం ఫార్ములాతో అదే వంకాయ కూర వడ్డించిందట పాపం....ఈ మూడ్రోజులూ ఏం మాట్టాడకుండా తిని వెళ్ళాట్ట....ఈ మహా ఇల్లాలు "గమ్మున తింటున్నాడుగా, నేను వంకాయ కూర ఎంత బాగా వండుతున్నానో" అనుకుని భుజాలెగరేసుకుంటూ శనివారంకూడా అదే వంకాయకూర పళ్ళెంలో వేసిందట.....అట్టా కంచంలో పడీ పడగానే ఆయన ఇంతెత్తున అరిచేసి కంచం విసిరికొట్టాట్ట....ఆ భార్యగారికీ వెంటనే కోపం తన్నుకొచ్చి మళ్ళా ఆ కింద పడ్డ కూరంతా ఎత్తి కంచంలో వేసి ఆయన ముందు పెట్టి,"ఇన్ని రోజులూ లొట్టలేసుకు తిన్నావ్, ఇవ్వాళేమైంది....తినకపోయావో పోలీసుల్ని పిలుస్తా" అందట.....హిహ్హిహొహిహిహి.....అసలే మెతక ప్రాణం ఏమో కిక్కురుమనకుండా తిన్నాట్ట సదరు భాబా....;)....హిహిహిహి...అదేనండీ భార్యాబాధితుడు......;)
మాకు ఈ కథ చెప్పి మమ్మల్ని హడలగొట్టేది మా అమ్మమ్మ...తినకపోతే నరాలవీరమ్మ(పైన చెప్పిన భార్యామణి పేరులెండి.....;)...) పిలిచినట్టు పోలీసుల్ని పిలుస్తా అనేది.....కుఁయ్,కఁయ్ అనకుండా తినేవాళ్ళం.............కాని బైటకొచ్చాక ఈ వేపుళ్ళ దెబ్బకి, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి పెరుగొంకాయ తిందామా అనిపించేది.....ఇప్పుడు నా వంటలో వంకాయ చేస్తే పెరుగొంకాయే......అంత విరక్తి వచ్చేసింది వేపుడన్నా, నూనొంకాయన్నా........పైగా ఎండాకాలంకదా.....చల్లగా కూర గొంతు దిగుతుంటే ఎంత హాయిగా ఉంటదో.....;).....
మరి చెప్పెయ్యనా ఎలా చేసుకోవాలో.........
- మాంఛి లేతగా విత్తనం పట్టకుండా ఉన్న వంకాయలు కావాలి.....ఈ కూరకు మన దేశవాళీ పొడవు వంకాయలే బాగుంటాయి....గుండు వంకాయలు అంత రుచి రావు......ఈ కాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగండి.......ఈ కాయల్ని సన్నగా కొంచెం పొడవుగా ముక్కలు కొయ్యాలి, పైన ఫోటోలో పెట్టాకదా, ఆ సైజులో.....కోసేప్పుడు పక్కనే నీళ్ళగిన్నె పెట్టుకుని, దాంటో చిటికెడు ఉప్పు వేసి ఈ కోసిన ముక్కని కోసినట్టు ఆ ఉప్పునీళ్ళల్లో వేసుకోవాలి....ముక్క విడిగా ఉంచితే నల్లగా అయిపోతుంది, పైగా కరుణెక్కుతుంది(చేదు వస్తుంది).......
- ఇప్పుడు కూరగిన్నె తీసుకుని దాంట్లో ఈ ముక్కలు నీళ్ళలోంచి తీసి వేసి, వెంటనే అవి మునిగేంతగా మజ్జిగ పొయ్యాలి.....మజ్జిగ కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది......
- ఇప్పుడు సరిపడా ఉప్పు,కారం వేసి ఈ గిన్నెని పొయ్యి ఎక్కించాలి.....కాస్త చిన్నవత్తిలో ఉడికించాలి..మరీ పెద్ద వత్తైతే ముక్క చిదిరిపోతుంది....కూర ఉడికేప్పుడు ఎక్కువగా కలపొద్దు....ఈ కూరకి ముక్క చిదిరితే బాగుండదు....మధ్య మధ్యలో గిన్నె పట్టుకుని ఎగరెయ్యాలి కూర కలవడానికి బాగా....ఈ ఎగరెయ్యటం బాగా అలవాటుంటేనే చెయ్యండి, లేకపోతే ముక్కలన్నీ గాల్లోకెళ్ళిపోతాయి....;)...అంత రిస్కు ఎందుకనుకుంటే చిన్న స్పూనులాంటిది తీసుకుని జాగ్రత్తగా కలపండి...ఇదంతా అడుగంటకుండా చూసుకోటం కోసమే....;)
- ముక్క బాగా ఉడికి, మజ్జిగ అన్నీ ఇగిరిపోగానే గిన్నె దించేసి చక్కటి ఇంగువపోపు పెట్టి దీంట్లోకి తిప్పెయ్యండి.....ఆ తిరగమాత మీదే వెంటనే సరిపడా పెరుగు వేసి కూరని కలిపెయ్యండి,పైనా కాస్త కొతిమీరాకులు చల్లుకోవాలి...మూతపెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి..అప్పుడు పెరుగు ముక్కకి బాగా పడుతుంది.....అల్లం,వెల్లుల్లి,పచ్చి మిరపకాయలు,మసాలాలు వెయ్యొద్దు, సాధుత్వం పోతుంది
- అంతే! కమ్మటి పెరుగువంకాయ తయార్....వేడిగా తిన్నా, చల్లగా తిన్నా అదిరిపోతుంది... ఇది నూనె వంకాయలా తొందరగా పాడవదు, ఫ్రిజ్జులో లేకున్నా సాయంత్రం వరకూ బానే ఉంటుంది.ఎండాకాలంలో ఈ కూర తింటుంటే పొట్టకీ, ప్రాణానికీ హాయిగా ఉంటుంది......
ఈ సారి మరో సూపర్ వంటకం చెప్పుకుందామే... అంతవరకూ సెలవా మరి......ః)
12:39 AM | లేబుళ్లు: తెలుగింటి కూర | 14 Comments
బజ్జులో "వంటల అవధానం"
ఇదేంటా! అనుకుంటున్నారా.....మరేఁ....మొన్నామధ్య నా బజ్జులో వంటలమీద తెగ డిస్కషన్లు నడిచాయిలెండి...మొదట గుంటూరోళ్ళు,గోదారోళ్ళ గొడవతో మొదలైంది...ఇక చూస్కోండి నా సామిరంగా...వరసగా ఇజీనగరమోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంతా వచ్చేసి జుట్లూ,జుట్లూ పట్టేసుకున్నారు,కొట్టేసుకున్నారు....హాటు హాటు డిస్కషన్లు జరిగాయి...వట్టి హాటే కాదులెండి, స్వీటుకూడా......కాని రిజల్టు మాత్రం సూపరు...ఎన్ని కొత్త కొత్త వంటలో, ఎన్ని రకరకాల రుచులో....
సాంబారు,పప్పుచారు,పప్పులుసు ల తేడాలు,కూరల్లో రకాలు..... ఆపై విసుర్లు,చతుర్లు,బూర్లు,గార్లు....మాదంటే మాదే అనుకోటాలు.... చమక్కుల చేగోడీలు, కరకర కారాలు...అబ్బబ్బ రెండ్రోజులపాటు నా బజ్జు తెగ నోరూరించేసిందంటే నమ్మరు..మీరూ చూసి కాసిన్ని లొట్టలేసుకోండి....ః)
koutilya choudary - Buzz - Public - Muted
deleep :)Mar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
బాగుందీ.. మీ ఇరువురి (సం)వాదం..Mar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
మేమూ పప్పుచారు బాచే! మాకు సాంబార్లు తెలియవు.
మీరు అభిమాన సంఘాన్ని రద్దు చేస్తే మేమింకొకటి పెట్టుకోలేమా?
కౌటిల్యా అదేంటి అలా కాళ్లబేరానికి వచ్చేసారు? గుంటూరోళ్ల పౌరుషాన్ని ఇలా బజ్జులో తాకట్టు పెడతారా?Mar 21DeleteUndo deleteReport spamNot spam
అనూ
కాని మా దిలీపుది కొంచెం విశాల హృదయం....
ఇందుకే గోదారోళ్ళని నమ్మకూడదనేది.....ః).
మా బెజవాడ భోజనానికి తిరుగులేదని నిరూపించాలి....Mar 21DeleteUndo deleteReport spamNot spam
మనుషు
మేము పునరాలోచించుకోవాలి.. అహో! అరే! కట కటా! ఈ మనిషినా? మేము అందలం ఎక్కిద్దామనుకున్నదీ!
రుచిలో
కడుపు నిండుడే కానీ, సంతృప్తి ఉండదు
రహ్మ
ఇలా కామన్ వి చెబితే ఎలా?Mar 21DeleteUndo deleteReport spamNot spam
అసలు స్వచ్చమైన జీడిపప్పు కూడా మాదగ్గరే దొరుకుతుంది, జీడిపళ్ళు ఉంటాయీ...అసలు చెప్పక్కత్లేదు స్వర్గం
గుంటురు, కృష్ణా, కోస్తా వంటకాలు వర్ధిల్లాలిMar 21DeleteUndo deleteReport spamNot spam
గుంటురు, కృష్ణా, కోస్తా వంటకాలు వర్ధిల్లాలిMar 21DeleteUndo deleteReport spamNot spam
భాటిల్య బాదురేయ్ Comments for ప్రియా దెయ్యంగారు
"చాలా సంవత్సరాల తర్వాత బొనికెల చారు పెట్టా….మర్చిపోయి అన్ని రక్తచారుల్లాగే నరమాంసం ఎక్కువ వేసేశా….అది కాస్త పింజారిచారు అయి కూర్చుంది…ః(…ః)…..ప్
సాంబార్ వేరే వేరే..అందులో మసాలా దినుసులు వేస్తారు...ధనియాలు, జీలకర్ర అన్ని దంచి వేస్తారు.Mar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
పప్పుచారు లో కొంచెం తక్కువ నీరు పోస్తారు.. కూరగాయలు+సాంబార్ పొడి లేకుండా చేయాలి..
పప్పు పులుసులో ఎక్కువ నీరు పప్పు,మిర్చి వెల్లుల్లి తప్పఏం ఉండవ్..Mar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
అయినా మీరు కాదని నాకు తెలుసు, అదీను పోస్టులు వేసేవారూ తెలుసు, వ్యాఖ్యలు పెట్టేవారు కూడా తెలుసుMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
నేను చెప్తున్నా పట్టించుకోకుండా బులుసుగారిని మాత్రమే అడుగుతున్నారు...ఇది మేము సహించం, క్షమించం
http://brijbaala.blo
what a coincidence that I found that blog post!Mar 21DeleteUndo deleteReport spamNot spam
తను నా స్నేహితురాలే :)Mar 21DeleteUndo deleteReport spamNot spam
ఏదో ఒక కూరగాయతొ పులుసు పెట్టుకుని దాన్లో ముద్ద పప్పు కలుపుకుంటాం..అదీ పప్పు పులుసు అంటే!Mar 21DeleteUndo deleteReport spamNot spam
నిలదీయం
మేమి
మా వంటలు వర్ధిల్లాలిMar 21DeleteUndo deleteReport spamNot spam
పప్పు చారులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాయలు..రామములగ కాయలు..అంతే ఇక వేరేవి వెయ్యం. కొంతమంది సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేస్తారు కాని ములక్కాయలు ఉన్నప్పుడు ఇవేవి అక్కర్లేదు.
గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టుMar 21DeleteUndo deleteReport spamNot spam
రెసిపీ ప్లీజ్Mar 21DeleteUndo deleteReport spamNot spam
అరటికాయ లంబా లంబా టైపా?Mar 21DeleteUndo deleteReport spamNot spam
ఇది పబ్లిక్ డొమెయిన్, పైగా మన బజ్ పోస్టుల్ని ఈ మధ్య కోదండరాం, కేసీయార్ స్క్రీన్ షాట్లు తీసి మరి చూస్తున్నారు, అంచేత మీరు గబా గబా రెసిపీ చెప్పండి, ఉత్తరాంధ్ర వారు కళ్యాణానికి పనికొస్తారో లేదో తెలిసిపోయిద్దిMar 21DeleteUndo deleteReport spamNot spam
సౌమ్యాంటి పైకి పైకి
దవ్వ ఆవకూర వర్ధిల్లాలిMar 21DeleteUndo deleteReport spamNot spam
ఐతే మేము మీ దవ్వని దవ్వ అని కాక, దూట అని పిలుస్తాం. :)Mar 21DeleteUndo deleteReport spamNot spam
అంచేత త్వరగా చెప్పండిMar 21DeleteUndo deleteReport spamNot spam
అరటి పువ్వుతో పప్పు, లేదా కొబ్బరి కోరు వేసుకుని చేసుకుంటారు.Mar 21DeleteUndo deleteReport spamNot spam
ఇందాకటి నుండి ఈ ఉత్తరాంధ్ర సొద, కాలి కాలి మాడు వాసనొస్తోంది
పైగా ఆ అల్లంచారాంటీ నన్ను దెయ్యంగార్ అనిన్దిMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
సౌమ్యాంటీ కిందికి కిందికి
గుంటూరు వంటలు వర్ధిల్లాలిMar 21DeleteUndo deleteReport spamNot spam
భయపెడుతున్నా
మాయింట్
ప్రతీ మాటను మనం శ్రీకాకుళంలో ఉన్నట్టు తను చైనాలో ఉన్నట్టు ఘాట్టిగా, సాగతీస్తూ మాట్లాడుతాడు
అంతే గానీ ఆయనకి షార్ట్ ఫాస్ట్ తెలీదుMar 21DeleteUndo deleteReport spamNot spam
March 21, 2011 at 10:17 am
చాలా సంవత్సరాల తర్వాత బొనికెల చారు పెట్టా….మర్చిపోయి అన్ని రక్తచారుల్లాగే నరమాంసం ఎక్కువ వేసేశా….అది కాస్త పింజారిచారు అయి కూర్చుంది…ః(…ః)…..ప్
మళ్ళీ రక్తం తాగుతా….
కెవ్వ్వ్వ్వ్
ఇక్కడ కాదు ఢిల్లీ కి వస్తా మీ ఇంటికి వస్తా చేసి చూపెట్టాలి మరిMar 21DeleteUndo deleteReport spamNot spam
అంతేనా...Mar 21DeleteUndo deleteReport spamNot spam
పప్పుచారాం
March 19, 2011 at 7:59 am
అయ్యో ఆయనకి ఖర్మ అని పేర్లో వాడితే నచ్చదుట.
idi raasiMdi meerEnaa?Mar 21DeleteUndo deleteReport spamNot spam
చల్లట్లు తెలుసా? ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయి, అందుకే రాస్తున్నా. :D :DMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
అన్నీ గుర్తొచ్చాక మీ బ్లాగులో రెసిపీలు ఫుటోలతో సహా పెట్టండిMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
తెలగపిండి గుండ తెలీదు
ఊరిబిండి ఏమిటి?
అలానే చల్లట్లు విన్నా గానీ రుచి ఆకారం చూడలేదుMar 21DeleteUndo deleteReport spamNot spam
ఈ బజ్జు మూలంగా అందరికి తెలియచేసేది ఏమిటనగా హోల్ ఆంధ్రా,,సీడేడ్..నైజాం
ఒప్పేస్కున్నాం
ఓకేనా. ఇక వంటలు గుర్తు తెచ్చుకోవటం మాని నిద్రపోండి
దెయ్యంగార్ నేనేఅనిందిMar 21DeleteUndo deleteReport spamNot spam
వరూధినిగారూ, మీరన్నది నిజమే, విజయనగరం వారి గొప్పతనం ఒప్పుకోకపోతే సౌమ్యగారు నిద్రపోయేలా లేరు! :)
రహ్మానుద్దీన్ గారూ, :)Mar 21DeleteUndo deleteReport spamNot spam
ఎవరో నాకు తెలుసు అయినా చెప్పలేను
కానీ ఇది వీవెన్ గారు, ఇజీనగరం వాళ్ళు కలిసి నాపై చేస్తున్న నీలాపనిందMar 21DeleteUndo deleteReport spamNot spam
అందరికీ తెలుసు దెయ్యంగార్ నేను కాదని అంచేత మీరే అలుసౌతారు అందరికీ. కానీ మీరు ఆంటీ అని పిలువబడటంతో మా జాతి మొత్తానికి ఆంటీ అయిపోయారుMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
వికటాట్టహాసాలకు హిడింబాది రాక్షసులకు నెలవు విజయనగరం.
దుఃశాసనాది రాక్షసుల కొలువు ఇంద్రప్రస్థం, రెండింటినీ అలంకరించిన పెద్ద రాక్షసాంటీ ఆ సౌమ్య ఆలమూరు.Mar 21DeleteUndo deleteReport spamNot spam
మీరు త్వరగా ముసలయితే మిమ్మల్ని బామ్మ అనికూడా అనేరోజు నాకు వస్తుంది వస్తుంది వస్తుందిMar 21 (edited Mar 21)DeleteUndo deleteReport spamNot spam
వూరు బిండి అనే మాట నామినోడి పేటెంటు! ఆయన పుస్తకాల్లోనే కాదు వాళ్ళింట్లో కూడా నాకు బెండకాయ ఊరుబిండి వడ్డించారు.(చచ్చాను తినలేక!)Mar 22DeleteUndo deleteReport spamNot spam
దుఃశాసనాది రాక్షసుల కొలువు ఇంద్రప్రస్థం, రెండింటినీ అలంకరించిన పెద్ద రాక్షసాంటీ ఆ సౌమ్య ఆలమూరు........
రహమానూ
అంతెందుకు, గడ్డితో కూడా పరమాద్భుతమైన వంట చేసి రాజుగారిని మెప్పించి ఆ పేరుమీద గరికవలస అనే గ్రామాన్ని సంపాదించిన ఘనత మా ప్రాంతపు ఒక పేదరాశిపెద్దమ్మకే దక్కిందంటే మా వాళ్ళు చేతి మహత్తు ఇంకా చెప్పక్కరలేదు. అలా అయితే మీ ప్రాంతం వాళ్ళు గడ్డి తింటారని పెడర్థాలు తియ్యకండి. అసలీ గడ్డి పచ్చడి ప్రణాళిక మీదనే కదా తక్కిన వాళ్ళు గోంగూర వగైరా ఆకులతో పచ్చడి చెయ్యడం కనిపెట్టింది. లేకపోతే అసలు వాళ్ళకిది సాధ్యమయ్యేదేనా!
సరే మా విజయనగరం ప్రత్యేక వంటలు మరికొన్ని ప్రస్తుతానికి ఒక చిన్న లిస్టు చెప్తాను, శ్రద్ధగా చదువుకోండి:Mar 22DeleteUndo deleteReport spamNot spam
రాంభద్రపు
మాడుగుల హల్వా
మావిడితాండ్ర
పాల
తిమ్మనం - పాలముంజెలు లాంటిదే
పోలిపూర్ణం బూరెలు - పెసరపప్పుతో పూర్ణం చేసి చేస్తారు
పేలపువడియాలు (పేలపిండి వడియాలు కాదు)
కొయ్యరొట్టి - మినప, పెసర, సెనగ - బియ్యం మొరుం
గంటిరొట్టి - గంటితో చేసేది
పనసపొట్టు కూర (ఇది సింహాచలం నుండి తక్కినచోట్లకి వెళ్ళింది)
సివంగి పులుసు (వంకాయలు మెంతికారం నూలుపొడి వేసి చేసే పులుసు)
అంతెందుకు, గడ్డితో కూడా పరమాద్భుతమైన వంట చేసి రాజుగారిని మెప్పించి ఆ పేరుమీద గరికవలస అనే గ్రామాన్ని సంపాదించిన ఘనత మా ప్రాంతపు ఒక పేదరాశిపెద్దమ్మకే దక్కిందంటే మా వాళ్ళు చేతి మహత్తు ఇంకా చెప్పక్కరలేదు. అలా అయితే మీ ప్రాంతం వాళ్ళు గడ్డి తింటారని పెడర్థాలు తియ్యకండి. అసలీ గడ్డి పచ్చడి ప్రణాళిక మీదనే కదా తక్కిన వాళ్ళు గోంగూర వగైరా ఆకులతో పచ్చడి చెయ్యడం కనిపెట్టింది. లేకపోతే అసలు వాళ్ళకిది సాధ్యమయ్యేదేనా!
సరే మా విజయనగరం ప్రత్యేక వంటలు మరికొన్ని ప్రస్తుతానికి ఒక చిన్న లిస్టు చెప్తాను, శ్రద్ధగా చదువుకోండి:Mar 22Mar 23DeleteUndo deleteReport spamNot spam
రాంభద్రపు
మాడుగుల హల్వా
మావిడితాండ్ర
పాల
తిమ్మనం - పాలముంజెలు లాంటిదే
పోలిపూర్ణం బూరెలు - పెసరపప్పుతో పూర్ణం చేసి చేస్తారు
పేలపువడియాలు (పేలపిండి వడియాలు కాదు)
కొయ్యరొట్టి - మినప, పెసర, సెనగ - బియ్యం మొరుం
గంటిరొట్టి - గంటితో చేసేది
పనసపొట్టు కూర (ఇది సింహాచలం నుండి తక్కినచోట్లకి వెళ్ళింది)
సివంగి పులుసు (వంకాయలు మెంతికారం నూలుపొడి వేసి చేసే పులుసు)
పప్పు నాగరాజు గారు ఈ బజ్జు చూడలేదేమో లేకపోతే ఆయన పొదిలోనుండి కూడా మరి కొన్ని అమ్ములు గురిపెట్టేవారు!!Mar 23 (edited Mar 23)DeleteUndo deleteReport spamNot spam
"దేవీ
రాంభద్రపు
మాడుగుల హల్వా"
ఇవి చూడండి,బ్రాండు నేమ్స్ తగిలించి వాటిని కూడా ఓ వెరైటీ చేసేస్తారు...ః)...మనం అలా అనం కదా...ఎలా చేసినా,ఎవరు చేసినా దాన్ని అసలు పేరుతోనే పిలుస్తాం...ః)
గంటిరొట్టి - ఇది కూడా మనకి తెలిసిందే అయి ఉంటుంది:)
ఓల్ ఆంధ్రా వంటలు వాళ్లవే! ఏంచేస్తాం.
సౌమ్యా గారికి గాల్లో తేల్తున్నట్టు ఉందేమో!
అవునూ భైరవభట్ల గారి వ్యాఖ్య మనకెవరికీ కనపడకుండా సౌమ్యాకే కనపడటం ఏంటి..ఇందులో ఏదో ఉంది!!!Mar 23DeleteUndo deleteReport spamNot spam
.............
నాదీ అదే మాట ఆMar 23 (edited Mar 23)DeleteUndo deleteReport spamNot spam
గుంటూరోళ్ళు బెదిరిపోతారని అనుకున్నారల్లే ఉందిMar 23DeleteUndo deleteReport spamNot spam
వీళ్ళు ఏదో పుక్కిటి పురాణాలు చెప్తే మనం డంగైపోతామనుకుంటున్నా
"ఇంతకీ వరూధినిగారు అడిగిన రొట్టెల సంగతి తేల్చలేదు సౌమ్య గారు"..ఇందాకట్నుంచి సునీతగారు ఈ కొశ్చనడుగుతున్నారు..
ఐనా బొత్తిగా అన్నిటికీ వేఱే పేర్లు ఏం పెడతారు చెప్పండి!Mar 23DeleteUndo deleteReport spamNot spam
ఇక లేభం లేదు సౌమ్యగారు. నేను కేసీయార్ కి ఫోను చేసాను. ఈ తెలంగాణా ఏదో తేలగానే తన సొంతూరు బొబ్బిలికి వచ్చేసి ప్రత్యేక విజయనగర రాష్ట్రం (ఉత్తరాంధ్రా కూడా కాదు) గురించి మరో ఉద్యమం మొదలుపెడతానని నాకు మాటిచ్చాడు. మనపై కోస్తాంధ్రవాళ్ళు చేస్తున్న ఈ సాంస్కృతిక అణచివేతపై మనం తిరుగుబాటు జెండా ఎగరేద్దాం!
హా అదీ బాగా చెప్పారు...మన విజయనగరం రాష్ట్రం రావలసినదే...అప్పటికి
హా అదీ బాగా చెప్పారు...మన విజయనగరం రాష్ట్రం రావలసినదే...అప్పటికి
అటు ఇజీనారమైనా, ఇటు గోదారైనా గుంటూరు తర్వాతనే.. ఆ.. అది తెల్సుకోండి ముందు! :)Mar 23 (edited Mar 23)DeleteUndo deleteReport spamNot spam
అలా కాకపోయినా కూడా నాకు గుంటూర్ అంటే బోల్డు చాలా ఇష్టం! :))Mar 23DeleteUndo deleteReport spamNot spam
అసలు గుంటూర్ అంత గొప్పది గుంటూరు... గుంటూరు వాళ్ళంతా గొప్పవాళ్ళు కేవలం గుంటూరు లోనే పుడతారు తెల్సా!
అయినా, ఇలా చెప్తూ పోతే పుస్తకాలు రాసేయ్యొచ్చు గుంటూరు గొప్పతనం గురించి.. హీ హీ హీ...
ఇప్పుడు మీరందరూ ష్.. గప్ చుప్.. సినిమాలో కోటని గుర్తు చేసుకుని బందరు ప్లేసులో గుంటూర్ ని ఊహించుకోవాలని మనవి.. :DMar 23DeleteUndo deleteReport spamNot spam
అబద్ధం! అబద్ధం!Mar 23DeleteUndo deleteReport spamNot spam
అసలు గుంటూర్ అంత గొప్పది గుంటూరు... గుంటూరు వాళ్ళంతా గొప్పవాళ్ళు కేవలం గుంటూరు లోనే పుడతారు తెల్సా!
అయినా, ఇలా చెప్తూ పోతే పుస్తకాలు రాసేయ్యొచ్చు గుంటూరు గొప్పతనం గురించి.. హీ హీ హీ._____________ఇంకో
అలా అన్నీ కలిపేసుకునేప్పుడు.. మావే అనుకుండా... అన్నీ మనందరివీ అనొచ్చు కదా!
గుంటూరోళ్ళ బుద్ధి గుంటూరు రోడ్ల గుంటల్లో పడి నలిగిపోనూ!Mar 23DeleteUndo deleteReport spamNot spam
ఆ సినిమాలో కోట బందరు గురించి చెప్పేది కామెడీగా ఉన్నా.. నిజ్జంగా ఆ ఊరి మీద ఎంత ప్రేమో ఇట్టే కనిపించేస్తుంది కదా! అందుకే అలా అన్నా.. కాదంటారా సుజాత గారూ... మీరే చెప్పండి.. చెప్పండి.. యువరానర్! ఖళ్..ఖళ్..Mar 23DeleteUndo deleteReport spamNot spam
గుంటూరో
పచ్
నిన్ను పచ్చడి చేస్తా!Mar 23DeleteUndo deleteReport spamNot spam
గమనికః ఇది సరదాకోసం,మరియు కొంతమంది మిత్రుల కోరికమీద ఇక్కడ పెట్టాను, ఎవరికన్న అభ్యంతరముంటే తెలుపగలరు,తీసేస్తాను...
4:16 PM | లేబుళ్లు: భోజనం కథలు | 4 Comments