ఇవాళ్టి నా భోజనం...."కొబ్బరికూర" తో.....
ఇవ్వాళ మెస్సుకి వెళ్ళబుద్ది కాలా! స్వయంపాకం రుచ్చూసి చాన్నాళ్ళయింది...వండుకుందాం అనుకుని, బియ్యం నానేశా....కూర ఏం వండుదామా అని ఫ్రిజ్జు తీసి చూస్తే, కూరగాయలేమీ లేవు.....మార్కెట్టుకి ఈ టైమప్పుడు వెళ్ళాలంటే మహా బద్దకం....ఏమున్నాయా అని చూస్తే, మొన్న గుళ్ళు తిరిగొచ్చిన ఫలితం రెండు కొబ్బరిచిప్పలు కనిపించాయ్....పచ్చడి చేద్దాం అనుకున్నా...కాని మనకి భోజనంలోకి కనీసం మూడు ఆదరువులుండాలి, హీనపక్షం రెండైనా ఉండాలి...వాటిల్లో ఒక "కూర" తప్పనిసరి....
పచ్చళ్ళైతే రెండు,మూడున్నాయి, మరిప్పుడు కూర ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే, ఓ బ్రహ్మాండమైన అవిడియా తట్టింది......ఏం! పచ్చికొబ్బరితో పచ్చడే చెయ్యాలా, ఇంకేం చెయ్యకూడదా అనిపించింది....మీక్కూడా అప్పుడప్పుడు అలానే అనిపించుంటది కదూ!
ఎలాగంటే,.............,
మీరుకూడా ఓపాలి ట్రై చెయ్యండి....:)
పచ్చళ్ళైతే రెండు,మూడున్నాయి, మరిప్పుడు కూర ఎలాగబ్బా అని ఆలోచిస్తుంటే, ఓ బ్రహ్మాండమైన అవిడియా తట్టింది......ఏం! పచ్చికొబ్బరితో పచ్చడే చెయ్యాలా, ఇంకేం చెయ్యకూడదా అనిపించింది....మీక్కూడా అప్పుడప్పుడు అలానే అనిపించుంటది కదూ!
గుడికెళ్ళొచ్చినాక మిగిలే కొబ్బరి చిప్పలు సాధారణంగా ఏదన్నా కూరలో తురిమెయ్యడమో లేకపోతే పొద్దున్నే దోశల్లోకి కొబ్బరి చట్నీ చెయ్యటమో చేస్తారు....మరీ ఓపికుంటే నాలుగు పచ్చిమిరగాయలేసి పచ్చడి నూరి అన్నంలో వేసుకుంటారు....ఇంకాస్త ఓపికెక్కువుంటే తురుం పట్టేసి కొబ్బరిలౌజు వండేసుకుంటారు....మరి మన బెమ్మీలకి ఇవన్నీ కష్టం కదా, టిఫన్లు బయట కాబట్టి చట్నీ పన్లేదు......పచ్చడి చేస్తే అన్నంలోకి ఆటిరాదు........మరి నాకొచ్చిన అవిడియా ప్రకారం ఇదిగా ఫాలో ఐపోయి చేశారనుకోండి, రుచికి రుచీ, ఆ పూట అన్నంలోకి మంఛి ఆదరువూ దొరుకుద్ది....పైగా ఒకపూట కూరగాయల ఖర్చూ మిగులుద్ది........:)
ఇంతకీ ఆ అవిడియా ఏంటా అనుకుంటున్నారా! "కొబ్బరికూర"...ఇహహాహ్హ! భలే కుదిరిందిలే! :)....చెయ్యడం బహువీజీ.....పది నిమిషాల్లో అయిపోద్ది....నేను ఎలా చేశానో చెప్పమంటారా......
ఎలాగంటే,.............,
- ముందు కొబ్బరిని అలా చిప్పల పళంగా పచ్చికొబ్బరి తురిమే దాంతో సన్నగా తురిమేశా.... (మీ దగ్గర అది లేదనుకోండి, మామూలు ఎండుకొబ్బరి తురిమే దాంతో అయినా తురుముకోవచ్చు,కాకపోతే కొంచెం కష్టపడాలి. అదీ లేకపోతే చాకుతో బాగా సన్నగా తరగండి. మిక్సీలో వెయ్యొద్దు,బాగా రాకపోవచ్చు.పెద్ద ముక్కలు పడనివ్వొద్దు,సరిగ్గా ఉడకవు.).
- తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఓ రెండు గెంటెలు నూనేశా....అది కొంచెం కాగిందనంగానే కాసిన్ని ఆవాలు,జీలకఱ్ఱ వేసేశా....మినప్పప్పు,పచ్చెనగపప్పు కాసిన్ని ఎక్కువేశా.(ఎందుకంటే ఇవి ఎక్కువ పడితే అవి తినేప్పుడు మధ్యలో తగులుతుంటే సూపర్గా ఉంటది)....ఒక ఎండు మిరగాయ తుంచి వేశా....ఒక వెల్లుల్లి రెబ్బ నొక్కి వేసి, ఆనక ఓ చిటికెడు ఇంగువ పడేశా....
- ఈ తిరగమాత గింజలన్నీ వేగి చిటపటలాడ్గానే, ముందే రెడీగా పెట్టుకున్న కొబ్బరి తురుము వేసేశా...
- కొంచెం గెంటెతో అలా అలా కలిపేసి, ఓ పెద్ద గ్లాసుడు నీళ్ళు పోసేసి ఉడకనిచ్చా....నీళ్ళన్నీ ఇట్టే ఇగిరిపొయ్యాయ్....మళ్ళా కాసిన్ని నీళ్ళు పోసి, పొయ్యి వత్తి తగ్గించా.....
- కాస్తంత ఉప్పు, ఘుమఘుమలాడిపోయే మా సంబారుకారం మరికాస్తంత వేసి వేగించటం మొదలెట్టా.....ఆట్టా సంబారుకారం పడగానే ఘుమఘుమా వాసనొచ్చేసి నోట్లో నీళ్ళూరిపోయాయంటే నమ్మరు....
- ఇక అలా వేగిస్తూ బాగా ఉడికిందనిపించగానే(ఉడక్కపోతే ఇంకాసిని నీళ్ళుపోసి ఇంకొద్దిసేపు వేగించొచ్చు) బాండీ దింపేసి మూతపెట్టి కాసేపు మగ్గనిచ్చా.....
- అంతే! ఘుమాయిస్తున్న "కొబ్బరికూర" రెడీ అయిపోయింది...
ఆ పాటికి పక్కన కుక్కర్ లో అన్నం ఉడికిపోయింది.....వేడి వేడన్నం పళ్ళెంలో పెట్టుకుని, దాంటో ఈ కొబ్బరికూరేసుకుని లొట్టలేసుకుంటూ లాగించా....తర్వాత కొత్తిమీర పచ్చడి, కొరివికారం-దుంపల పచ్చడి(వీటి రెసిపీలు తర్వాత టపాల్లో రాస్తానేం..) కమ్మటి నెయ్యితో...చివరాకర్న పెరుగు, మాగాయ....అట్టా ఇవాళ్టి భోజనం ముగిచ్చేసి, గఱ్ఱున త్రేన్చేశానన్నమాట!
మీరుకూడా ఓపాలి ట్రై చెయ్యండి....:)
12:24 AM
|
లేబుళ్లు:
తెలుగింటి కూర,
భోజనం కథలు
|
You can leave a response
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Blogger ఆధారితం.
19 కామెంట్‌లు:
sir'
I heard that you are a physician...correct me if i am wrong.
Who do you write the blogs for?
If you have nothing to write,
please stay away or close the blog.
Don't write junk just for the sake of just writing or continuing the blog.
sick...of this...
బాగుంది మీప్రయౌగం... నేను ప్రయత్నించాలి !
ఇంతకి లొట్టలేసుకుంటూ తిన్నారు కదా ... రుచి ఎలా ఉందొ చెప్పలేదు ?
అజ్ఞాత sir,
Yes, what you heard is true. I can't tell you who he actually writes for, but I can tell you who he doesn't write for. People like you. Yes, you, sir!
If you have nothing worth doing with your online-life, then do yourself and us a favor - go watch porn (Junk free porn, I mean) instead of lamenting about 'junk writings' here.
Remember - the door is right behind you. Turn around and get the .... you know the rest! :)
డాక్టరు అయినా మన అందరిలాగే రోజూ భోజనం చెయ్యాలి.
స్వహస్తం తోటి తయారు చేసుకుంటున్నందుకు మెచ్చుకోవాలి. ఇంకా చేసుకున్న వాటిల్లో బాగా వచ్చినవి మనకోసం చెప్పటం ఇంకా మెచ్చుకో తగ్గది. కౌటిల్య గారూ
మాకోసం వ్రాయండి. మీరు చెప్పే వంటలో మెళుకువలు మాకు కావాలి. మేమూ కూడా తోచినప్పుడు స్వంత చేతులతో వంటలు చేసుకుని తింటాం.
@ RK
మీ వ్యాఖ్య నాకు ఆమౌదయౌగ్యమే...
కాని ఆ 'అజ్ఞాత ' వ్యక్తి కావాలనే ఇలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించాడని
నా అభిప్రాయం. అక్కడ వ్యక్తిగత దూషణే తప్ప టపాకు స్పందిస్తున్నట్టుగా ఏమి లేదు !
@ అజ్ఞాత
మీరు ఇలా ఏందుకు వ్యాఖ్యానించారొ అది మీ విజ్ఞతకే తెలియాలి ,
ఈ టపాలొ మీకు అంతగా రుచించని విష్యం ఏంటొ తెలియజేస్తే బాగుండేది !
అయినా ఇలా 'అజ్ఞాత' గా వ్యాక్యానించనవసరం లేదు .. నిరభ్యంతరంగా మీపేరుతొ వ్యాఖ్యా నించవచ్చు ( మీకు పేరు ఉంటే) .
@
Ajnata
Same question to you. What do you write the comments for?
అజ్ఞాత గారు తమరు ఏ లోకకళ్యాణార్ధం ఈ వ్యాఖ్య చేశారో తెలుసుకోవచ్చా... ఎవరైనా బ్లాగులు తమకోసం రాసుకుంటారు. వాళ్ళు రాసినవి మనకు నచ్చితే చదువుతాం లేదంటే ఆ వైపు కూడా తొంగి చూడవలసిన అవసరం లేదు, ఈ మాత్రం కనీస తెలివి తేటలు లేని మీరు ఈ బ్లాగరికి చెప్పొచ్చారా ??? మీ ఒక్కరికి నచ్చనంతమాత్రానా ఇతను బ్లాగులు రాయడం మానేయాలా ??
కౌటిల్య గారు హిడెన్ ఎజెండా తో ఇటువంటి వ్యక్తులు రాసే వ్యాఖ్యలు మీరు పట్టించుకోవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. మీరు అనుకున్న విధంగా బ్లాగింగ్ కొనసాగించండి. తరచుగా వ్యాఖ్యలు రాయకపోయినా కొత్త టపాల కోసం ఎదురుచూస్తూ ఆసక్తిగా మీ బ్లాగ్ చదివే నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు.
కౌటిల్యగారూ, మీరు ప్రయోగం చేసి చక్కగా వచ్చినందుకు అభినందనలు.
మేమూ కొబ్బరి కూర చేస్తాం. ఎలాగో నా బ్లాగులో రాస్తానేం!
అన్నట్టు పైన ఉన్న సీసాలు భలే ముద్దుగా ఉన్నాయండోయ్!
కోస్త కొబ్బరి కాయలు అలానే ఉంటాయి . రుచిగా .. మా గోదావరిని తిట్టేసి .. దానితో కుర వండుతార .. నేనొప్పుకోను
కౌటిల్య గారు,
మీరు వంటలు చెయ్యడం భలె చెప్తారండి నాకు అసలు వంటల బ్లాగులుచూడడం నచ్చదు. వాళ్ళు ఎదొ రెస్టారెంట్‌లలో చేసుకునేలాగా చెప్తారు. మీ బ్లాగ్ బాగా నచ్చింది. మీరు ఇంట్లో చేసే వంట లాగా చెప్తారు. అన్నట్టు మీరి చెప్పిన క్యారెట్ హల్వా చేసానండి. చక్కెర, నెయ్యి కొంచెం తక్కువే వేసి చేసాను గాని బాగా వచ్చింది. మీరు ఇలానే మంచి మంచి వంటలు చెప్తూ వుండండి.
ఇందులొ కాస్త పచ్చి శనగపప్పు నానబెట్టి పోపులో వేస్తే ఇంకా బావుంటుంది.ఈసారి చూడండి. వచ్చే పిల్ల ఎవరో కాని మీతో కాస్త కష్టమే.వంట వచ్చిన మగాళ్ళు ఒక పట్టాన ఇంకొకరి వంట నచ్చరు.
ముందుగా, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు RK గారికి, కట్టా విజయ్ గారికి, రావు గారికి, భరద్వాజ్ గారికి, శుభకర్ గారికి నా ధన్యవాదాలు...మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి...
విజయ్ గారూ,
ఇక ఆలస్యమెందుకు ప్రయత్నించండి..తిని గఱున తేన్చానంటే రుచి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలి...ః)
రావు గారు, శుభకర్ గారు,
తప్పకుండా రాస్తానండీ...ఆపే సమస్యేలేదు....మీలా చదివే వాళ్ళున్నప్పుడు ఎలా ఆపగలనండీ..!
మందాకిని గారూ,
ఇప్పుడే మీ టపా చదివా..ఈ సారి నేను అలాకూడా ట్రై చేస్తా...ఇకపోతే, ఆ సీసాలు నచ్చే ఈ టెంప్లెట్ పెట్టానండీ!ః)
కావ్య గారూ! బజ్జులో చెప్పాగా, అవి కోస్తా కొబ్బరికాయలేకానీ, మీ గోదావరివి కాదు..మా గుంటూరువి...ః)..
స్నేహ గారూ,
మీ కామెంటు చదివాక నా బ్లాగు పర్పస్ మీట్ అయ్యాను అనిపించింది..చాలా ఆనందంగా అనిపించింది..బోల్డన్ని మంగిడీలు మీకు..
జ్యోతి గారూ,
ఈసారి అలా తప్పకుండా ట్రై చేస్తా...
ప్రేమ ఉన్న చెయ్యి ఎలా వండిపెట్టినా అమృతంలా ఉంటదన్న విషయాన్ని నేను గాఢంగా నమ్ముతానండీ! సో,మీరు చెప్పిన ప్రాబ్లెం నాకు ఉండదులెండీ!...;)
అయ్యా అజ్ఞాత గారూ,
రాత్రే మీ కామెంటుకి ఘాటుగా సమాధానం చెప్దాం అనుకున్నా...కాని మీలాగ మొహం దాచుకున్నే పిరికి వాళ్ళని చూస్తే నాకు కాస్త జాలి ఎక్కువ...ఇప్పుడు మీకు బాగా అర్థం అయిందనుకుంటా నేను ఎవరికోసం నా బ్లాగులు రాస్తుంటానో! మీకు నచ్చకపోతే దయచేసి నా బ్లాగు వైపు రావద్దు,నేనేమీ మిమ్మల్ని రమ్మని బామాలలేదుగా....
FOR YOUR CLARIFICATION, I AM NOT JUST A PHYSICIAN, BUT A SURGEON ALSO..HOPE U CAN UNDERSTAND THE DIFFERENCE...AND MY PROFESSION DOESN'T RESTRICT ME TO WRITE BLOGS....
నేనెప్పుడూ ఇలాంటివి తినలేదు, వినలేదు. నేనిలాంటివి ఇంట్లో వండితే మా గజం(మా ఆవిడ) కొబ్బరి చిప్పలు తగలెట్టావా అని అప్పడాల కర్రతో వాయించి, ఆపూటకు ముద్ద పెట్టదు. :( ఏ ఓటల్లో ఇలాంటివి చేస్తారండి?
మై డియర్ గజంబాధిత అజ్ఞాత గారూ,
ఇలాంటివి ఓటేళ్ళలో వండరండీ!ఇళ్ళలో వండుకుంటారు...పొద్దస్తమానం ఇంటో అప్పడాలకఱ్ర నెత్తిమీద మోదించుకునే మీకు ఇంటి భోజనం రుచి ఎలా తెలుస్తుందిలెండి..అయినా మీ భ్రమగాని ఏదన్నా హోటల్లో వండినా, అది మీకు చెప్పినా మీకేం ఉపయోగముంటదిలెండి...
బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ జన్మ...అంతవరకు మీ గజం గారితో తన్నులు తింటూ జీవితం గడిపేయండి...
అజ్ఞాతలకి ఈ రెసిపీ ఎందుకంత ఏవగింపు కలిగించిందో కాని, ఇది నా ఇష్టమైన కూరల్లో ఒకటి!:-) అప్పుడప్పుడూ ఇంట్లో కూరలేం లేనప్పుడు కాని, మామూలు కూరలతో బోరు కొట్టినప్పుడు కాని మేం చేసుకుంటునే ఉంటాం. దీనికే మరొక వెర్షను సెనగపప్పు ఉడికించి అది కూడా కలపడం. పప్పుకొబ్బరి కూర.
కామేశ్వరరావు గారూ! వాఆఆఆఆఅ...మీక్కూడా తెలుసా..ప్చ్..నేనేదో కనిపెట్టేశానని తెగ ఫీల్ అయిపోతున్నా...ః)
మీరు చెప్పిన రెండో వెర్షను జ్యోతిగారు,సుజాత గారు కూడా చెప్పారు..ఈసారి ప్రయత్నించాలి..
మీ అభిమానానికి ధన్యవాదాలు...
ఇప్పుడే వంట నేర్చుకోవటం మొదలుపెట్టాను. తాలింపు కూడా sarigga రాదు :) మాలాంటి వారికి emaina beginners book ఉంటే చెప్పగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి