రోటి పచ్చళ్ళు - రెండవభాగం - చుక్కకూర పచ్చడి; కొసరుగా " మెంతికూర పప్పుచారు"
నా రోటిపచ్చళ్ళ ధారావాహికంలో రెండవభాగానికి స్వాగతం! సుస్వాగతం! కిందటిసారి చెప్పిన రోళ్ళవిషయాలు బాగా గుర్తున్నాయా! ఎవరన్నా తెచ్చుకున్నారా కొత్తరోలు!..:)
సరే ఈసారి ఆ రోట్లోకి వాడుకునే పచ్చడిబండలూ, రోకళ్ళూ, పొత్రాల గురించి నాలుగుమాటలు చెప్పి తర్వాత పైన పుటోలో పెట్టిన పదార్థం గురించి చెప్తా.....;)
మామూలుగా నూరుకునే పచ్చళ్ళకైతే, పచ్చడిబండ సరిపోతుంది. అదే, చట్నీలు (అదేనండీ బాబూ! దోశల్లోకి,ఇడ్లీల్లోకి), ఊర పచ్చళ్ళూ గట్రా రుబ్బుకోవాలంటే పొత్రం కొనుక్కోవాల్సిందే! నాకు పొత్రంతో అంత పనిలేదనిపించి ఒట్టి పచ్చడిబండ వరకు తెచ్చుకున్నా.... బాగా నున్నగా చెక్కిఉన్న పచ్చడిబండ తీసుకోవాలి.నూరేవైపు వెడల్పు ఎక్కువ ఉండాలి.చివర్లో పట్టుకోను కాస్త బుడిపెలా ఉన్నదైతే బాగుంటుంది. మా ఇంట్లో ఎఱ్ఱచందనంతో చేసిన రోకలిబండ ఉండేది. దాంతో పచ్చడి తొక్కితే పచ్చడి ఎఱ్ఱ్రగా, భలే రంగులోకి వచ్చేది. కమ్మటివాసన కూడా ఉండేది....
ఇక పెద్దరోకళ్ళ విషయానికొస్తే, బాగా పొడవాటివి ఉంటాయి, చివర ఇనపకట్లతో....వీటిని గింజలు దంచుకోటానికి, పొడిపిండి కొట్టటానికి, పెద్దమోతాదులో పచ్చళ్ళకి వాడతారు. కుందిరోళ్ళలోనే వాలుగా ఉంటుంది. అదేదో సినిమాలో "పగడపురోకలి, బంగరుకట్లూ" అని పెళ్ళిపాటలో వస్తుంది.... ఎలా ఐనా నా పెళ్ళికి బంగారురోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి...ఇప్పుడు బంగారం ధరలు చూస్తే కనీసం అరచేతులో పట్టే రోలూ, వేలుపొడవు రోకలి కూడా చేయించుకోలేననిపిస్తోంది.....;)
ఇక పొత్రాలు! రెండు రకాలుంటాయి. గుండు పొత్రాలు, చివర మొనదేలి ఉండేవి. ఇవి రోలుగుంట ఆకారాన్ని బట్టి ఉంటాయి. సరైన సైజు చూసి వేయించుకోవాలి పొత్రం. లేకపోతే రోలు మొత్తం దండగే...సరిగ్గా తిరుగుతుందా, లేదా చూసుకోవాలి. కక్కుకూడా బాగా ఉన్నదే తీసుకోవాలి. అడుగు వెడల్పులేని పొత్రాలే బెటర్! లేకపోతే పిండి కిందకెళ్ళిపోయి సరిగ్గా మెదగదు. పిడికూడా సరిగ్గా వేయించుకోవాలి. మా పొత్రం పిడి సరిగ్గా ఉండేదికాదు. మా అమ్మమ్మ పిడి చేసిన కంసలాణ్ణి తిట్టుకుంటూ "దభీ, దభీ"మని గుండ్రాయితో నాలుగు దెబ్బలు ఆ పిడిమీద వేసి, వాడిమీద కసి తీర్చుకునేది, రుబ్బే ప్రతిసారీ..;)
ఇంకోరకం బండలుంటాయ్, నూరుడుబండలని! బల్లపరుపుగా ఉన్న రాయిమీద, కొంచెం పొడవుగా చెక్కిన ఇంకో రాయితీసుకుని అడ్డంగా పెట్టి ముందుకూ,వెనక్కూ నూరతారు. మావేపు ఎక్కడా ఇవి వాడకంలో లేవు నాకు తెలిసి. నెల్లూరులో ఉంటాయి. మసాలాలు నూరుకోను వాడతారు ఎక్కువగా....
ఇక ఇవ్వాళ నేను చెప్పబోయే రోటిపచ్చడి, చుక్కకూర పచ్చడి. చెయ్యటం చాలా తేలిక, తొందరగా అయిపోతుందికూడా చెయ్యటం, ఖచ్చితంగా పదినిమిషాల పని.... పైగా ఈ పచ్చడి రోట్లో తప్పితే బాగోదు. మిక్సీల్లో వేస్తే మరీ లేహ్యమైపోయి అంతబాగోదు.
ఆకుకూరలన్నిటిలోకల్లా నాకు ఇష్టమైంది చుక్కకూరే! దీన్ని అన్నిరకాలుగా వండుకోవచ్చు. పైగా దాని రుచి వేరేవాటికి రాదు. పప్పులో పెట్టినా, పచ్చడి చేసినా,తోటకూరతో కలిపి పులుసుకూర చేసినా ఎంత కమ్మగా ఉంటుందో! చింతపండు అవసరం లేదు, సహజసిద్ధమైన పులుపు.... పాలకూర, పప్పులోకి తప్ప పనికిరాదు.(రోటీల్లోకి వండే కూర మనకసలు నచ్చదులెండి..;)..). ఇక తోటకూర పచ్చడికి పనికిరాదు. పచ్చడికి బాగుండేవి రెండే! చుక్కకూర, మెంతికూర..... రెండిట్లో చుక్కకూరే బాగుంటుంది. ఇక ఎలా చెయ్యాలో చెప్తానేం!
పచ్చికొబ్బరి, ఎండు మిరపకాయలూ వేస్తే వేసుకోవచ్చు, లేకపోయినా బానే ఉంటుంది. ఎండు మిరపకాయలు వెయ్యకపోతే పచ్చిమిరపకాయలు కాసిని ఎక్కువ వెయ్యాలి. చుక్కకూర పులుపుకి, కారం ఎక్కువ పడుతుంది. ఉప్పుకూడా కాస్త ఎక్కువే పడుతుంది,చూసుకుని కలుపుకోవాలి.
చుక్కకూర పచ్చడితోపాటు , మరి రెండాదరువులు కూడా చేశానివ్వాళ. లేతవంకాయ ముక్కలు,టమాటాతో కలిపి నూనె లో మరికాస్త సంబారు కారం వేసి మగ్గించా. మా వాళ్ళు భోజనానికి వస్తామన్నారని, కాస్త ఆటిరావాలని తర్వాత పప్పుచారు పెడదామనుకున్నా. వెరైటీగా చేద్దాంలే అని " మెంతికూర పప్పుచారు " చేశా.... అద్భుతంగా కుదిరింది. పెద్దగిన్నెడు చేస్తే మావాళ్ళు చుక్క మిగల్చకుండా లాగించేశారు. అదికూడా సింపులుగా చెప్తాను ఎలా చేశానో! అసలు పప్పుచారులు,పప్పుపులుసులు,సాంబారులు; రకాలు; మరెప్పుడన్నా డీటైల్గా చెప్పుకుందాం......:)

- చుక్కకూర మీడియం సైజు కట్టలు రెండిటితో చేస్తే పైన గిన్నెలో ఉన్నంత పచ్చడయ్యింది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోడమే! చుక్కకూర చివరకాడలు కత్తిరించి, ఆకుని బాగా నీళ్ళల్లో వేసి కడగాలి.లేకపోతే ఇసక ఉండిపోతుంది.
- ఇప్పుడు పొయ్యిమీద బాండీ పెట్టి, ఒక చిన్నగెంటెడు నూనెవేసి అది కాగగానే పైన కడిగిపెట్టుకున్న చుక్కకూరవేసి వేయించాలి. చుక్కకూర ఊరికనే వేగిపోతుంది.అలా బాండీలో వెయ్యగానే రంగుమారిపోతుంది. ఆకులోంచి నీరు బైటకి వస్తుంది. ఆనీరు సగానికిపైగా ఇగిరిపోయే వరకు వేయించాలి. ఈ వేయించినదాన్ని వేరే గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి.
- ఇప్పుడు బాండీలో ఇంకో గెంటెడు నూనెవేసి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసి వాడ్చాలి. చివర్లో కాసిని ధనియాలు,మెంతులూ,జీలకఱ్ఱ్రా వేసి అవి వేగగానే దించెయ్యాలి.
- ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి, కాస్త పచ్చికొబ్బరి, నాలుగు ఎండుమిరపకాయలు, ఒక చుక్కనీళ్ళూ వేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి.
- తర్వాత దాంట్లో పైన వాడ్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలూ,మెంతులూ,ధనియాలూ,జీలకఱ్రా వేసి పైన నాలుగు వెల్లుల్లి రెబ్బలువేసి తొక్కాలి.
- పైవన్నీ బాగా మెదిగాయనగానే, పైన వేయించి పెట్టుకున్న చుక్కకూరని దీంట్లో వేసి, ఒక పెద్ద స్పూను ఉప్పువేసి రోకలిబండ గుండ్రంగా తిప్పుతూ నూరాలి. మామూలుగా తొక్కినట్టు తొక్కితే నీరుగా ఉన్న కూరమొత్తం చిందిపోతుంది. నాలుగైదుసార్లు తిప్పగానే బాగ మెదిగిపోయి అన్నీ కలిసిపోతాయి. మరీ లేహ్యంలా చెయ్యొద్దు.
- ఇక దీన్ని గిన్నెలోకి వేసుకుని, పచ్చనగపప్పూ, మినప్పప్పూ మరికాస్త వేసి ఇంగువతాలింపు పెట్టుకోవాలి.
- వేడి వేడన్నంలోకి అప్పుడే తాలింపు పెట్టిన పచ్చడి వేసుకు తింటుంటే, నూనెలో వేగిన పప్పులూ,ఎండు మిరపకాయలూ తగుల్తూ అద్భుతంగా ఉంటుంది.
పచ్చికొబ్బరి, ఎండు మిరపకాయలూ వేస్తే వేసుకోవచ్చు, లేకపోయినా బానే ఉంటుంది. ఎండు మిరపకాయలు వెయ్యకపోతే పచ్చిమిరపకాయలు కాసిని ఎక్కువ వెయ్యాలి. చుక్కకూర పులుపుకి, కారం ఎక్కువ పడుతుంది. ఉప్పుకూడా కాస్త ఎక్కువే పడుతుంది,చూసుకుని కలుపుకోవాలి.
చుక్కకూర పచ్చడితోపాటు , మరి రెండాదరువులు కూడా చేశానివ్వాళ. లేతవంకాయ ముక్కలు,టమాటాతో కలిపి నూనె లో మరికాస్త సంబారు కారం వేసి మగ్గించా. మా వాళ్ళు భోజనానికి వస్తామన్నారని, కాస్త ఆటిరావాలని తర్వాత పప్పుచారు పెడదామనుకున్నా. వెరైటీగా చేద్దాంలే అని " మెంతికూర పప్పుచారు " చేశా.... అద్భుతంగా కుదిరింది. పెద్దగిన్నెడు చేస్తే మావాళ్ళు చుక్క మిగల్చకుండా లాగించేశారు. అదికూడా సింపులుగా చెప్తాను ఎలా చేశానో! అసలు పప్పుచారులు,పప్పుపులుసులు,సాంబారులు; రకాలు; మరెప్పుడన్నా డీటైల్గా చెప్పుకుందాం......:)
- ముందు, అరగ్లాసుడు (మా ఇంటినుంచొచ్చిన,మంగలంపెట్టి వేయించి చేసిన) కందిపప్పు నానేశా... ఒక అరగంట నాననిచ్చి శుభ్రంగా కడిగి, గ్లాసుడు నీళ్ళుపోసి కుక్కర్లో పెట్టి పొయ్యిమీద పెట్టా.
- నిమ్మకాయంత చింతపండు రెండుగ్లాసుల నీళ్ళుపోసి నానబెట్టా.
- పప్పు ఉడుకుతుండగా, ఒక పెద్ద ములక్కాయ, రెండు టమాటాలు ముక్కలుగా కోశా. నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా నిలువుగా తరిగా.
- ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకుని వేళ్ళు కత్తిరించి, మిగతా ఆకుని ముక్కలుగా కోసి పక్కన పెట్టా.
- వెడల్పాటి గిన్నె తీసుకుని, పొయ్యి మీద పెట్టి నాలుగు స్పూనులు నెయ్యివేసి, ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి వేసి, మరికాస్త ఇంగువ,కరివేపాకు వేసి పోపు పెట్టా... అందులో పైన కోసి పెట్టుకున్న టమాటా,పచ్చిమిర్చీ,ములక్కాయలూ,మెంతికూరా వేసి టమాటాలు మెత్తగా అయ్యేవరకూ ఉడకనిచ్చా....నెయ్యిలో మెంతికూర వేగుతుంటే ఎంత కమ్మటి వాసనొచ్చిందో!
- ఇప్పుడు,పైన నానబెట్టిన చింతపండు పిండి ఆ పులుసు ఈ తాలింపులో వేసి, సరిపడా ఉప్పూ, కాస్త సంబారుకారం,కాస్త పసుపూ వేసి మరిగించా...
- కుక్కర్ నాలుగు విజిల్స్ రాగానే దించి పప్పుగుత్తితో పప్పు మెత్తగా ఎనిపి పెట్టుకున్నా.
- పులుసు బాగా తెర్లగానే ఈ ఎనిపి పెట్టుకున్న పప్పువేసి ఇంకాసేపు మరిగించా.
- కాస్తంత పచ్చికొబ్బరి తొక్కివేశా. కాసిన్ని కొత్తిమీరాకులు, చిన్న ముక్క బెల్లం కూడా వేశానండోయ్...
- బాగా తెర్లి, చిక్కబడ్డాక దించేశా...
5:17 PM
|
లేబుళ్లు:
చారులు,
బండ పచ్చళ్ళు
|
You can leave a response
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Blogger ఆధారితం.
5 కామెంట్‌లు:
సాంబారు కారం ఎలా చెయ్యాలో చెప్తారా
భలే ! వంట బ్లాగుల్లో మీకు ఫస్ట్ రాంక్ అండీ కౌటిల్య గారు! అవునూ , మీ పేరు నలుడు, భీముడు అని పెట్టుకుంటే బాగుండేదేమో. లేక వాటితో పాటు మీ పేరు కూడా చేరుతుందేమో. :-)
నేను మీమాటలు చదవటానికే ముఖ్యంగా మీ బ్లాగ్ కువస్తుంటాను. భలే వర్ణిస్తారు. ఎంతైనా భోజన ప్రియుల మాటలతో చేసి పెట్టిన వాళ్ళ కడుపు నిండిపోతుంది.
చుక్కకూర పచ్చడి నా ఫేవరెట్. అదేమిటో నా అంత పులుపు తినేవాళ్ళు ఎవరూ తగల్లేదు నాకు. అందుకని నేను మాత్రమే చేస్తాను అనుకున్నా.
ఇలాగే పాలకూర ఉల్లిపాయలతో చేస్తుంటాను. అది తిన్నవాళ్ళందరూ మెచ్చుకున్నారు. పులుపు తినలేం, కమ్మగా కావాలనుకునే వాళ్ళకి అదే మేలు.
>>>ఎలా ఐనా నా పెళ్ళికి బంగారురోలూ, బంగారపు కట్లేసిన పగడపురోకలితో పసుపు దంచాలని కలలు కనేవాణ్ణి...హిహిహి.
అధ్యక్షా మీ పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్ గా ఒక రుబ్బురోలు పోత్రం ఇచ్చేస్తారా ఏమిటి? (మీరు బంగారం వి కొనుక్కున్నా లేకపోయినా)..... అహా
యీ వంటలు బ్లాగ్వనభోజనాల కోసం కాదా?
na peru roopa.... koutilya garu... miru blog rayatam manesara leka kotha blog radthunnara.... continue cheyatam ledhem??? busy ga vunnara ledha vantalu cheyatam bore kottesindha? asalu blog chusukuntunnara????
కామెంట్‌ను పోస్ట్ చేయండి