పులిహోర గోంగూరా - బోల్డన్ని క్షమాపణలూ
అందరికీ ముందుగా బోల్డన్ని క్షమాపణలు! ఎందుకంటారా! ఏం లేదండీ, తర్వాత టపా చూస్తే మీరు అగ్గిమీద గుగ్గిలమైపోతారు మరి! నామీద విరుచుకుపడకుండా ముందస్తు జాగ్రత్తగా చెప్పేస్తున్నానన్నమాట!..:)
ఇక విషయమేంటంటే, అప్పుడెప్పుడో "మాలిక పత్రిక" శ్రావణపౌర్ణమి సంచికలో ఒకపోటీ, దానికైన గెస్సులూ, హడావుడీ గుర్తున్నాయా! అదన్నమాట సంగతి!..:)... అందులో ఆ "గోంగూరకథ" రాసింది నేనేనని తర్వాత అనౌన్సు కూడా చేశామనుకోండి! ఇప్పుడెందుకు ఆ విషయం మళ్ళా చెప్తున్నాననుకుంటున్నారా! మరి, అప్పుడు పోటీ కోసమని అందర్నీ బాగా తికమక పెట్టాను కదా, పైగా బోల్డన్ని అబద్ధాలుకూడా ఆడేశాను మరి, అందర్నీ కన్ఫ్యూజ్ చెయ్యటానికి! అందుగ్గాను ఇలా నా బ్లాగుముఖంగా పేద్ద "సారీ" చెప్దామని ఈ టపా అన్నమాట!(పన్లోపని, మన రెసిపీ నా బ్లాగులో ఉంటుందీ, మరిన్ని హిట్టులూ వస్తాయ్!..;)...)
ముఖ్యంగా నేను ఎక్కువ మిస్ లీడ్ చేసిన వ్యక్తులు కొందరున్నారు. శంకర్ గారు, రాజ్, వేణూ శ్రీకాంత్! వీళ్ళకి బోల్డన్ని సారీలన్నమాట! గుంజీలు తియ్యమన్నా తియ్యాల్సిందే! అంతగా నటించానన్నమాట..;)..ఏం చేద్దాం! పోటీ అంటే పోటీ ఏ కదా, అన్ని రకాలుగా ప్రయత్నించాలి...:)
మిక్సీ, ఫొటోలో ఉల్లి ( పోస్ట్ లో ఎక్కడా చెప్పలేదు, ఎవరన్నా ఆ పాయింటు కనిపెడతారేమో అని చూశా! ఇంకా, ఆ ఫొటో నాది కాదన్నమాట!..:)...), ఉల్స్ కుమ్మడం...ఇలా కొన్ని కావాలనే మిస్ లీడ్ చెయ్యటానికి రాశానన్నమాట!.. కాని నా గురించి అంతబాగా గుర్తు పెట్టుకుని ఆ విషయాల్లో, నేను కాదని వేణూఅన్నాయ్, వరూధినిగారు వాదిస్తుంటే, భలే ఆనందమేసింది, "ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారో! " అని..:)..అందుకని వాళ్ళకి థేంక్యూలూ, సారీలూ....
సుజాత గారు చాలా దగ్గరకు వచ్చారు కాని, చిన్నపాయింట్లలో చెప్పలేకపోయారు.... ఇక నా శైలిని ( అసలు పోటీ ఇదే కదా!) ఖచ్చితంగా గుర్తుపట్టి చెప్పినవాళ్ళు సుధగారు, సునీతగారు, ఎన్నెలగారు, బులుసు గారు...(వీళ్ళు కూడా తర్వాత మిస్ లీడ్ అయ్యారనుకోండి)...;).. వీళ్ళందరికీ చాలా బోలెడు థేంక్యూలు.....
ఇక ఆ టపా మళ్ళా మన పాకవేదం అభిమానుల కోసం...:)
నేనూ "వంటలు" రాశానోచ్
మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అదేంటీ, వంటలు వండుతారుగాని, రాయటమేమిటీ అంటారా! ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..). ఒకాయన "బ్లాగునలుడూ", ఇంకొకాయన "బ్లాగుభీముడూ"...... ఒకావిడ ఆరో,పదారో,నూటయాభైయ్యారో "రుచులు"తెగ రాసేస్తుంటుంది. మరొకావిడ "రుచులు" అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది.....:). మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా! అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా, సారీ! రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా అనుకుని రాసేద్దామని డిసైడైపోయా....
ఇక వాళ్ళలా కాకుండా కాస్త సిన్సియర్గా వండిమరీ రాద్దామని బాగా ఇదిగా అనేసుకున్నా. కాని ఎక్కడ రాయాలి???..... గోడలమీదా,గొబ్బెలమీదా రాస్తే ఎవరు చూస్తారు? పైగా మా ఇంటిఓనరు పట్టుకు తంతాడు. బ్లాగొకటి తెరిచి రాద్దామా అనుకుంటే మనం మహావీర బద్దకస్తులం కదా!"ఉన్న మూణ్ణాలుగు బ్లాగులే సరిగ్గా మెయింటైన్ చెయ్యట్లా, ఇప్పుడు కొత్తగా మరోటి మొదలెట్టి, అదికూడా గాలికొదిలేస్తే, బ్లాగ్లోకంలో ఇప్పుడున్న కాస్తపరువు కూడా పోతుంద"ని మా --.బ్లా.స. మిత్రులు హెచ్చరించారు. ఏ పత్రిక్కో పంపిద్దామా అంటే మనవాళ్ళు చూసే పత్రికలేం ఉంటాయ్, పైగా ఆ పత్రికలవాళ్ళు మన వంటకం వేస్తారని గ్యారంటీ ఏం లేదుకదా అని తెగ ఆలోచించేస్తుంటే ఓ అవిడియా తట్టింది.....
మన "మాలిక పత్రిక" వాళ్ళు, కొత్తవాళ్ళని, వాళ్ళ టాలెంటుని ఎంకరేజ్ చేస్తారని, విభిన్నమైన అంశాలకి ప్రాముఖ్యతనిస్తారని తెలుసు కదా! సో వాళ్ళని డవిరెక్టుగా కాంటాక్టు చేశా. వాళ్ళదసలే విశాల హృదయం. నా విషయం చెప్పగానే, "మీకెందుకు, మీరు రాసి పంపండి.వేసేస్తాం.."అని నాకు అభయహస్తం ప్రకటించేశారు. అద్గదీ ఇంకేముంది! హాయిగా ఊపిరి పీల్చుకుని రాయటానికి ప్రిపేరై పోయా.......
హ్మ్! రాయాలంటే మరి వండాలికదా! "ఆ! మరీ చెప్తావ్! రాయాలంటే నిజంగానే వండాలా ఏంటీ, ఏదో ఒకటి రాసేస్తే పోలా, చదివే వాళ్ళంతా నిజంగా చూడొచ్చారా పెట్టారా?"అన్నారు మా --.బ్లా.స. మిత్రులు. ఊఁహూఁ! నే ఒప్పుకోలా, మరి నేను చాలా సిన్సియర్ కదా! అందుకని నిజంగా వండాక రాద్దాం అనుకున్నా. ఐతే ఇంతకీ ఏం వండాలి? అని తెగ ఆలోచించా......
ఇంతలో మా బికీలీక్స్ బృందం ఓ మాంఛి ఇన్పర్మేషన్ తెచ్చారు. ఆ సదరు బ్లాగుభీముడుగారు ఒక వెరైటీవంటకం చేసి మరొకాయనకి పార్సెలు ఇచ్చారంట. అది ఇంకా ఆయన బ్లాగులో పెట్టలా, ఇప్పుడప్పుడే పెట్టే ఆలోచన కూడా లేనట్టుంది. ఇంతకీ ఆ వంటకం ఏంటనుకున్నారు, "పులిహోరగోంగూర పచ్చడి". ఓస్! అదే కదా అనిపించింది. ఆయనేనా చేసేది,రాసేది! మేం చెయ్యలేమా,రాయలేమా అనుకున్నా! పైగా మొదలెట్టటమే "ఊరగాయలతో", అదీగాక నాకు అత్యంత ప్రాణప్రదమైన మన "ఆంధ్రమాత" గోంగూరతో మొదలెడితే మనకీర్తి దశదిశలా వ్యాపిస్తుంది కదా అనిపించి ఉబ్బితబ్బిబ్బై ,"శభాష్" అని నా జబ్బ నేనే చరిచేసుకున్నా.......:)......
ఇక పచ్చడి ఎలా పెట్టాలి, ఏమేం సంభారాలు కావాలి అని ఆలోచించా. మా అమ్మ,పెద్దమ్మ కలిసి పెట్టేవాళ్ళు ఆ పచ్చడి. వాళ్ళు పెట్టిన పచ్చడి సప్తసముద్రాలవతలక్కూడా ప్రయాణం చేసొచ్చేది. అమ్మకో ఫోనుకొట్టి ఎలా పెట్టాలో, ఎంతెంత కొలతలో కనుక్కున్నా. పైగా వాళ్ళు పెడుతుంటే ఏళ్ళ తరబడి చూసిన అనుభవంకూడా బోలెడుంది కదా! ఇంకేముంది అన్నీ తెచ్చుకుని రంగంలో దూకేశా.....
ఏమేం తెచ్చుకున్నానంటే :-
ఎలా చేశానంటే :-
ఈ పచ్చడి ఎలా తినాలంటే :-
కంచంలో వేడివేడన్నం పెట్టుకుని, ఈ పచ్చడేసుకుని్, మాంఛి వెన్నపూసేసుకు తింటుంటే ఉందీ నా సామిరంగా! అబ్బబ్బ!యమాగా ఉందిలే! ఇది జొన్నసంకట్లోగాని, రాగిసంగట్లో గాని ఏసుకుతింటూ మజ్జెన ఉల్స్ కుమ్ముతూ ఉంటే ఇంకా యిరగదీసేస్తదంతే.....;)
మీరు చేసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :-
ఏం లేదండీ, ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే పచ్చడి రుచీ అదిరిపోద్ది, ఎక్కువనాళ్ళూ ఉంటది.

- మాంఛి ముదురుగోంగూర - ఒక కేజీ
- చింతపండు - నూటాయాభై గ్రాములు
- ఎండు మిరపకాయలు - రెండొందల గ్రాములు
- ధనియాలు - చారెడు
- మెంతులు - రుచికి సరిపడా (అంటే ఒక రెండు స్పూనులనుకోండి)
- నూనె - అరకేజీ
- వెల్లుల్లి పాయలు - వలిచిన రెబ్బలు ఒక చారెడు
- ఉప్పు - పావుకేజీ
- ఇంకా తాలింపుకి ఇంగువ, తాలింపు గింజలు
ఎలా చేశానంటే :-
- ముందు గోంగూరని శుభ్రంగా కడిగేసి ఆరనిచ్చి బాండీలో సరిపడా నూనె వేసి వేయించాను.
- గోంగూర వేగుతుండగానే, ముందే బాగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు బాగా పిసికి పులుసు తీసి పొయ్యిమీద పెట్టి పులిహోర పులుసులా కుతకుతా ఉడికించా. ఉడికాక దించి పక్కన పెట్టా. వేగిన గోంగూరని కూడా...
- ఇప్పుడు ఎండు మిరపకాయలు మరికాస్త నూనెవేసి బాగా వేయించా. అవి బాగా వేగేప్పుడు చివర్లో ధనియాలు,మెంతులు వేసి అన్నీ బాగా వేగగానే దించేశా....
- ఇప్పుడు ఈ మిరపకాయలు,ధనియాలు,మెంతులు,ఉప్పు కలిపి మిక్సీలో వేసి, బాగా మెత్తగా అయ్యేలా చేసి ఆ "కారం" పక్కన పెట్టుకున్నా...
- ఇక పైన వేయించి పెట్టుకున్న గోంగూర, ఉడకబెట్టిన చింతపండు పులుసు, కొట్టిపెట్టుకున్న కారం అన్నీ కలిపి గ్రైండర్లో వేసి రుబ్బాను.
- వెడల్పాటిబాండీ పొయ్యిమీద పెట్టుకుని మిగిలిన నూనె అంతాపోసి బాగా కాగనిచ్చి తాలింపు గింజలు,ఇంగువ వేసి చిటపటలాడగానే దించి ఈ నూనె ముందు రుబ్బిపెట్టుకున్న పచ్చడికి కలిపాను.
- చివర్లో ఆ చారెడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపి ఆరాకా తీసి బుల్లిజాడీకి పెట్టాను.
- అంతే! ఘుమ్మని వాసనలు కొడ్తున్న "పులిహోర గోంగూర" తయారైపోయింది.
ఈ పచ్చడి ఎలా తినాలంటే :-
కంచంలో వేడివేడన్నం పెట్టుకుని, ఈ పచ్చడేసుకుని్, మాంఛి వెన్నపూసేసుకు తింటుంటే ఉందీ నా సామిరంగా! అబ్బబ్బ!యమాగా ఉందిలే! ఇది జొన్నసంకట్లోగాని, రాగిసంగట్లో గాని ఏసుకుతింటూ మజ్జెన ఉల్స్ కుమ్ముతూ ఉంటే ఇంకా యిరగదీసేస్తదంతే.....;)
మీరు చేసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు :-
ఏం లేదండీ, ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే పచ్చడి రుచీ అదిరిపోద్ది, ఎక్కువనాళ్ళూ ఉంటది.
- మొదట గోంగూర బాగా ముదురాకు తీసుకోవాలి. ఎందుకంటే లేతాకు వేయించగానే లేహ్యంలా ఐపోతుంది. ముదురాకైతేనే తాళ్ళుతాళ్ళుగా ఉండి బాగుంటుంది. ఇక లేతాకే దొరుకుతుందనుకోండి ఎక్కువ రుబ్బాల్సిన పన్లేదు. బాగా కలిపినా సరిపోతుంది. ఏ ఆకైనా మిక్సీలు,గ్రైండర్ల కంటే రోట్లో రుబ్బితేనే బాగుంటది.
- ఆకు కేజీ అంటే వలిచిన ఆకు, కట్టలతో కాదు...:)..... ఆకుని ఎక్కువగా కడగొద్దు, ఒక్కసారి నీళ్ళల్లో ముంచి దులిపి తీసెయ్యండి. ట్యాపుల కింద ఎక్కువసేపు పెట్టి కడగొద్దు. అలా చేస్తే ఆకుకి ఉన్న పులుసు కారిపోతుంది. అప్పుడు రుచీ పచీ ఉండదు.నిలవకూడా ఉండదు.
- ఇక పై కొలతలన్నీ నేను ఉజ్జాయింపుగా చెప్పినవే. ఎందుకంటే అమ్మ అన్నీ కట్లు,అరసోలల లెక్కన చెప్పింది...:)
- చింతపండు పులుసు పిసకక పోయినా, బాగా ఉడికించి అది మిక్సీ పట్టేస్తే తొక్కంతా కూడా కలిసిపోతుంది. పులుసుకూడా చిక్కగా ఉంటుంది.
- ఇక కారం! పైన నేను చెప్పినట్టు అప్పటికప్పుడు కొట్టుకున్నా సరే లేకపోతే మామూలు పచ్చళ్ళకారమైనా వాడుకోవచ్చు. అప్పుడు కారం కొలత - అరసోల, అంటే షుమారు ౩౦౦మిలీ గ్లాసుతో కొలిస్తే ఎంత వచ్చిద్దో అంత, ఉప్పు కూడా అంతే. ఆ కారానికి ధనియాలు,మెంతులూ సరిపడా కలిపి కొట్టుకోవాలి. కాని వేయించికొట్టిన కారమే రుచి. ఉప్పుకూడా కళ్ళుప్పైతేనే బాగుంటుంది.
- నూనె కూడా చూసుకుని కలుపుకోవాలి. ఆకుని బట్టి మారుతుంది కలుపుకోవాల్సిన కొలత. వేరుశనగనూనె ఐతేనే కమ్మగా ఉంటుంది. గోంగూర ఎంత నూనె పోసినా, ఎన్ని మిరపకాయలు పోసినా వద్దనదని వెనకటికెవరో ఓ కవిగారు చెప్పారు మరి!...:)
- తాలింపు గింజల్లో మినప్పప్పూ,పచ్చనగపప్పూ,ఆవాలూ,ఎండు మిరపకాయలూ, ఇంగువా వేసుకోవాలి. జీలకఱ్ఱ్రా,కరివేపాకూ అవసరం లేదు.
- ఇక వెల్లుల్లి ఇష్టమున్నవాళ్ళు వేసుకోవచ్చు,లేకపోతే లేదు.
- ఇక అన్నిటికన్నా ముఖ్యం తడిచేతులు,తేమ అస్సలు తగలనివ్వొద్దు. పచ్చడి బాగా ఆరాకే డబ్బాకో,జాడీకో పెట్టండి. ఇలా చేస్తే తేలిగ్గా నాలుగైదునెలలుంటుంది, మీరు ఉండనిస్తే...;)...... ఫ్రిజ్జులో అయితే సంవత్సరంపాటుంటుంది.
- పచ్చడి రెండురోజులు ఊరనిచ్చి తింటే సరిపోతుంది మరి! నేనిక్కడ తెగ లాగించేస్తున్నా, మీరూ బరిలోకి దిగండి మరి.
10:31 PM
|
లేబుళ్లు:
కుండ పచ్చళ్ళు
|
You can leave a response
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Blogger ఆధారితం.
13 కామెంట్‌లు:
కౌటిల్య వాక్యాల చివర పెట్టే చుక్క చుక్కకో రూపాయిస్తే భారద్దేసపు ఆకలి సమస్య తీరిపోద్ది :)
హ హ RK గారూ. అంటే డాక్టర్ చెప్పిన స్టైల్ లో వంట చేయాలంటే చుక్కలు కనిపిస్తాయని సింబాలిక్ గా చెప్తారన్న మాట. అర్ధం చేసుకోవాలి.:)))
డాక్టర్.. నాకు మాత్రం ఈ పోస్ట్ చదవగానే అర్ధమయ్యి పోయింది ఇది మీరే రాశారనీ.. (నేనిదే చదవటం లెండీ)
నాకయితే ఫోన్ లో లైవ్ లో చెప్తున్నట్టే ఉంది.. ;)
హహహ! బాగుంది! ఇన్ని వ్రాశారు, జాగ్రత్తల్లో ఇంగువ వేయాలి అని చెప్పారు కదా! ఎక్కువకాలం ఆ రుచి, సువాసన, ఘాటు ఉండటానికి ఖాదీ ఇంగువ వాడాలని చెప్పడం మరిచారే :P యల్. జి. ఇంగువ డబ్బాలకి డబ్బాలు పోసినా ప్రయోజనం శూన్యం కదండీ!
:))
కౌటిల్యా, ముదురు గోంగుర ను ఎలా కనుక్కోవాలి? పోనీ, కాస్త ఆకు పీకి తిని చూడమంటావా? ఆకులు డార్క్ రంగులో ఉన్నది తెచ్చినా ది కాస్తా వేయించేసరికి లేహ్యం అయిపోతోంది. ఎలా...ఎలా కనుక్కోవాలి? అందుకే ఈ సారి హైద్రాబాదొచ్చేటపుడు ఒక పది కట్టలు ముదురు గోంగూర పట్రావడం మర్చిపోవాకు! ఇంట్లో బీవారం నుంచి వచ్చిన పాల ఇంగువ కూడా ఉంది
ఈ సారి పులిహోరలో ఆవపెట్టి ఉంచుతాను :-)
Courier me Koutilya.it's mouthwatering
:-))
నిజమే నండి. :( మీరే అని కరెస్ట్ గానే చెప్పా.. జ్యోతి గారు దబాయించినా, కాస్త నసిగాను.. కాని వేణు శ్రీకాంత్ గారు గాఠి గా దబాయించి లాజిక్లు తీస్తుంటే, కన్ఫ్యూస్ అయ్యి, కిమ్మన లేకపోయా..... మొత్తానికి నేనే కరెక్ట్ అన్నమాట...
మరేదో బహుమతులున్నాయి అన్నారు.... :D నాకేనా...
-సుధ
నిజమే నండి. :( మీరే అని కరెస్ట్ గానే చెప్పా.. జ్యోతి గారు దబాయించినా, కాస్త నసిగాను.. కాని వేణు శ్రీకాంత్ గారు గాఠి గా దబాయించి లాజిక్లు తీస్తుంటే, కన్ఫ్యూస్ అయ్యి, కిమ్మన లేకపోయా..... మొత్తానికి నేనే కరెక్ట్ అన్నమాట...
మరేదో బహుమతులున్నాయి అన్నారు.... నాకేనా...
-సుధ
చూడ్డానికి బాగానే ఉంది. తినడానికి కొంచెం పంపించకూడదూ..... దహా
హహహ సుధ గారు :-D అప్పటికీ ’మనల్ని ఏమార్చడానికి కౌటిల్య మార్చి రాస్తే నేను చెప్పలేను కానీ..’ అని ముందే ఓ డిస్క్లైమర్ పెట్టాను కదండీ :-). సాథారణంగా నేను అంత వాదించేవాడ్ని కాదు కానీ మా తమ్మాయ్ నన్ను బకరా బుచ్చిబాబుని చేశాడ్లెండి. నాకు పింగ్ చేసి మరీ “నేనెందుకు కాదనుకుంటున్నావో పాయింట్స్ చెప్పచ్చుకదా..” అని ఎంకరేజ్ చేసేసరికి నేను మరీ రెచ్చిపోయా :-) మీక్కాదండీ అసలు ఎక్కడలేని లాజిక్కులూ చెప్పి అందరిని కన్ఫూజ్ చేసి ఎవర్నీ గెలవకుండా చేసిన నాకు ఇవ్వాలి వాళ్ళాబహుమతేదో :-P
ఆర్కే!..ః)
శంకర్ గారూ! అవునా, అంత కష్టంగా చెప్తున్నానా..;)
రాజ్!..థేంక్యూ....ః)
రసజ్ఞ గారూ! ఖాదీఇంగువంటే పాలఇంగువేనా! అది చెప్దామనుకున్నాగాని, మనవాళ్ళు అది కొనటానికివెళ్ళి దాని రేటు చూసి, ఏదీ కొనకుండా వచ్చేస్తారేమోనని..;)
శ్రీకాంత్ గారూ! ఆ నవ్వుకు అర్థమేమి...ఏమనుకోవాలి మేము..;)
హ్మ్! సుజాతగారూ! అందుకే నేను పోస్ట్ లో ఎక్కడా అనలేదు, మార్కెట్లో తెచ్చుకున్న గోంగూర అని....ః)
మార్కెట్లో మనకు దొరికేది అంతా లేత గోంగూరే! మొక్కలు అలా పీక్కుని తెచ్చేస్తారు. రంగు మార్పువల్ల కాదు ముదురు, లేత తేడా తెలిసేది. మొక్క బాగా పెద్దదై కాయపట్టాలి. ఆ కాయలు ఎండి పగిలి విత్తనాలు రాలే స్టేజ్ లో ఉంటే బాగా ముదిరినట్టన్నమాట! బాగా కాయపట్టి ఉంటే సరిపోద్ది, మరీ ఎండనవసరం లేదు. అప్పుడు ఆకు కాడ పట్టుకు చూస్తే గట్టిగా ఉంటుంది, బాగా ఈనెలు తేలి ఉంటుంది...అదన్నమాట!..ః)
ఆవపులిహోర కోసమైనా వచ్చేస్తా...ః)
శేఖర్ గారూ, బులుసు గారూ! మా ఊరుమీదుగా మీ ఊరెవరన్నా వస్తుంటే చెప్పండి, పంపుతా..ః)...
సుధ గారూ! హిహిహి! మీరు మరి చివరిదాకా నిలబడలేదుగా!..ః)
అన్నాయ్! మరి అందుకేగా నీకోసమే స్పెషల్గా టైటిల్ పెట్టా..ః)... నీకు బహుమతి కాదుగాని, మా "పాకవేదం" తరపునుంచి ఏం కావాలో ఆర్డరు వెయ్యి, ఈసారి నువ్వొచ్చేపాటికి రెడీగా ఉంచుతా...ః)
కామెంట్‌ను పోస్ట్ చేయండి